తెలుగు చిత్రసీమలో పాటల పందిరి అన్న మాటకు మొట్టమొదట అంకురార్పణ చేసిన చిత్రంగా వాహినీ వారి మల్లీశ్వరి నిలచింది. 1951 డిసెంబర్ 20న విడుదలైన మల్లీశ్వరి చిత్రం కళాభిమానులకు ఆనందం పంచుతూ విజయకేతనం ఎగురవేసింది. మహానటుడు యన్టీఆర్, మహానటి భానుమతి నటనావైభవానికి మచ్చుతునకగా మల్లీశ్వరి నిలచింది. 1951 మార్చి 15న విడుదలైన పాతాళభైరవి చిత్రం యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపితే, ఆయనలోని నటనను వెలికి తీసిన చిత్రంగా మల్లీశ్వరి నిలచింది. ఈ చిత్రం విడుదలై…