సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారని, 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం…
దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ తదితరులతో చర్చించే అవకాశం…
రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ యాత్ర ఫలించకపోతే ప్రజలకు కష్టాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలంటూ ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇకపై ఎన్నికలు జరగవని అన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అప్రమత్తమై ఓటేయాలని కోరారు. మోడీ గనుక మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని…
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ) అందరూ తరలిరావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Harish Rao: కాంగ్రెస్ నేతల మాటలు, కాంగ్రెస్ హమీలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మూడు గంటలు కరెంట్ చాలన్న ఆయన నిన్న నారాయణఖేడ్ వచ్చాడని, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తామని, ఆ రాష్ట్ర ఓటర్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ఉన్న గోచి ఊడిపోయిందని అన్నారు.