సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానాన్ని పరిశీలకులు ఢిల్లీకి పంపించారు. అయితే, రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ముగిసింది. దీంతో ఢిల్లీ నుంచి కాసేపట్లో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సీఎల్పీ భేటీకి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్ పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కర్ణాటక డిప్యూటీ సీఎం తీర్మానం చేశామన్నారు.
Read Also: Extraordinary Man : రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన టీమ్..
ఇక, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి సీఎల్పీ నేత ఎంపిక కొనసాగుతుంది. సాయంత్రం 5.30 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం అయ్యింది. కాసేపట్లో తెలంగాణ సీఎంను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెయిటింగ్ చేస్తున్నారు. ఆ సమాచారం వచ్చిన తర్వాత సీఎల్పీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్‌భవన్‌కు తెలుపుతుంది. అయితే, అధిష్టానం నిర్ణయం వచ్చిన వెంటనే సీఎం అభ్యర్థి ఇవాళ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్ తమిళి సైతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిదిగా కోరారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్‌భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాజ్‌భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును కూడా పెంచారు.