డబ్బుకోసమో, కోపతాపాలతోనో మనుషులు కిడ్నాప్ వ్యవహారాలకు పాల్పడుతుంటారు. మనుషులను కిడ్నాప్ చేయడం లేదా, పెంపుడు జంతువులను కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. మనుషులు మాత్రమే కాదు మేము కూడా కిడ్నాప్ చేయగలమని నిరూపించింది ఓ కోతి. ఓ చిన్న కుక్కపిల్లని కిడ్నాప్ చేసి మూడు రోజులపాటు తనవద్దనే బందీగా ఉంచుకొని స్థానికులకు చుక్కలు చూపించింది. ఈ సంఘటన మలేషియాలోని తమన్ లెస్టారిపుత్రలో జరిగింది. ఓ కోతి రెండు వారాల వయసున్న చిన్న కుక్కపిల్లను కిడ్నాప్ చేసి అడవిలోని చెట్లను ఎక్కేసింది. చెట్టుమీద నుంచి మరో చెట్టు మీదకు వెళ్తున్నా, కుక్కపిల్లను మాత్రం వదలలేదు. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు కుక్కపిల్లను విడిపించేందుకు నానా తంటాలు పడ్డారు. మూడు రోజులపాటు తీవ్రంగా ప్రయత్నం చేయగా ఎట్టకేలకు కుక్కపిల్లను వదిలివేసింది ఆ కోతి.