ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459…