Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుందనే అభియోగాల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ సిఫారసులతో నిన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో మహువామోయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.