మహీంద్రాకు చెందిన బీఈ6 గురించి తెలిసిందే. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.97 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌తో బీఈ6 ఇప్పుడు భారతీయ రోడ్లపై రెండవ సురక్షితమైన ఎస్‌యూవీగా అవతరించింది.