ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉంటే గురువారం కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మహిందా రాజపక్సేకు కోర్ట్…
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోంది. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సేలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహిందా రాజపక్సే. భద్రతా కారణాల వల్ల ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. తాజాగా దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్ట్ నిషేధం విధించింది.…
శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని…
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజకపక్సేలకు.. జనం పవరేంటో తెలిసొచ్చింది. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా.. ఎమర్జెన్సీ విధించినా నిరసనకారులు తగ్గడం లేదు. అధికార పార్టీ నేతల్ని వెంటపడి…
తీవ్ర ఆర్థిక, ఆహారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి. ఆందోళనకారుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శ్రీలంకలో నిన్నటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 7 మంది మరణించారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 260 మందికి తీవ్రగాయాలు కాగా… ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటికే మహిందా రాజపక్సే తన ప్రధానికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల వల్ల మహిందా…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో.. లంక తగలబడిపోతోంది… ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది.. ఆగ్రహంతో ఊగిపోతోన్న ప్రజలు.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పెపెట్టారు.. పలువురు మంత్రులు, ఎంపీల ఇళ్లకు సైతం నిప్పుపెట్టారు. సోమవారం ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. దాంతో ఆయన మద్దతుదారులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై దాడి చేయంతో..…
శ్రీలంకలో దారుణపరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే వున్నారు. కొలంబోలోని పార్లమెంటు భవనం ముందు అండర్ వేర్లతో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ధరలు సామాన్యుడికి అందడం లేదు. ఎప్పుడూ లేనివిధంగా ధరలు అంతరిక్షాన్ని తాకాయి. దేశం దివాలా అంచున నిలిచింది. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ప్రజలు, విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు…