Koti Deepotsavam 2024 Day 5: ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 9 నుంచి 25 వరకు వైభవోపేతంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. ఇల కైలాసంలో జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలను వీక్షించి లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులయ్యారు.
Koti Deepotsavam 2024 Day 4: నాలుగో రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
క్షీరాబ్దిద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు (బుధవారం).. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా డా.ఎన్. అనంతలక్ష్మి గారిచే ప్రవచనామృతం జరుగగా.. అనంతరం వేదికపై మల్దకల్ శ్రీవేంకటేశ్వర స్వామికి కోటి తులసి అర్చన, మహానందికి మహాభిషేకం నిర్వహించారు. భక్తులచే విష్ణుమూర్తి విగ్రహాలకు కోటి తులసి అర్చన వైభవోపేతంగా నిర్వహించారు. తర్వాత.. తులసీ దామోదర కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. తదుపరి.. పల్లకీ సేవపై అమ్మవారు, స్వామి వార్లు ఊరేగుతూ.. భక్తజనకోటికి ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా శ్రీఅద్వైతానంద భారతి స్వామిజీ (శృంగేరి జగద్గురు, అవని) గారి అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకుంది. ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..