తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఉద్వేగభరితంగా ప్రసంగించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు రాముడు.. జగన్ రాక్షసుడు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజు ప్రత్యేక స్థానం. పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయి.. ఎవ్వరూ ఏం చేయలేరు. టీడీపీని ఏదో చేద్దామనుకున్న వాళ్లు గాల్లో కొట్టుకుపోయారు. టీడీపీ కార్యకర్తల శరీరం కొస్తే పసుపు రక్తం వస్తుంది. వైసీపీ నేతలు చంపే…