శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనుండగా.. మార్చి 4 వరకు అంటే 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇక, ఈ నెల 23 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తామని, దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ ఉంటుందని.. మొదటిసారి…