నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య.. దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకి హాజరయ్యారు. అయితే, ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆంమె అలెర్జీతో బాధపడుతున్నారు. అయినప్పటికీ గంగా నదిలో పవిత్ర స్నానం చేసే ఆచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద గిరి మంగళవారం మాట్లాడుతూ.. ఆమె పవిత్రస్నానంలో పాల్గొంటారని, శిబిర్‌లో…
Maha kumbh mela: ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం, హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళ’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదులు త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Maha kumbh Mela 2025: గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది.
MahaKumbh 2025: మహా కుంభమేళా ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 9) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో పర్యటించబోతున్నారు.
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు నడవనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైలు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. సోమవారం…
Maha Kumbh Mela 2025: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ‘మహా కుంభమేళా’కు సిద్ధమవుతోంది. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అపురూప కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జరగబోయే ఈ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతారు. హిందూ మతంలో అతపెద్ద పండగల్లో కుంభమేళా ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం…