పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు.. ప్రస్తుతం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 90 శాతం మంది అవినీతిపరులు ఉన్నారని.. 90 మంది అసమర్థులైన అధికారులతో పనిచేస్తున్నారని పేర్కొంది.. కనీసం కేసుల విచారణ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. పోలీసు శాఖలో కేవలం 10 శాతం మంది సిబ్బంది మాత్రమే నిజాయితీగా, సమర్థతతో ఉన్నారని.. అన్ని కేసుల్లోనూ విచారణ జరుపుతారని ఆ కొద్ది శాతం అధికారుల నుంచి ఆశించలేమని తేల్చి చెప్పింది.. అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు…