Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌తో పట్టుబడ్డ నిందితుడు..
- భార్య నుంచి చంపి 4 ఏళ్లుగా పరారీ..
- చివరకు పట్టించిన ఎల్పీజీ గ్యాస్ బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: భార్యను చంపిన కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తి గత 4 ఏళ్లుగా పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. అయితే, చిన్న LPG సిలిండర్ బుకింగ్ అతడిని పట్టుకునేలా పోలీసులకు సాయం చేసింది. వినడానికి కొద్దిగా షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజం. భార్య హత్య కేసులో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు శిక్షను ఖరారు చేసిన తర్వాత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న భారత సైన్యానికి చెందిన ఒక మాజీ కెప్టెన్‌ను పట్టుకోవడంలో ఎల్పీజీ సహకరించింది.
మధ్యప్రదేశ్ లోని పాంధుర్నా జిల్లాలో సందీప్ తోమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని పోలీసులు తెలిపారు. 2013లో తోమన్ అబోహర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే భార్య శ్వేతా సింగ్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు విచారణ తర్వాత ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా తేలింది. 2014లో కోర్టు అతడిని దోషిగా నిర్దారిస్తూ, జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును 2022లో హైకోర్టు సమర్థించింది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
2019లో తోమర్ బెయిల్‌పై విడుదలై, పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ, తన గుర్తింపును దాచాడు. తోమర్ మామ రామ్ నరేష్ నిందితుడిని పట్టుకోవాలని 2024లో హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు విచారణ వేగవంతమైంది. దీని కోసం ఒక సిట్ ఏర్పాటు చేశారు.
అయితే, తోమర్ ఇటీవల ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేయడానికి తన పాన్ కార్డ్‌ను లింక్ చేసిన ఒక బ్యాంక్ అకౌంట్‌ను ఫాజిల్కా పోలీసులు గుర్తించడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీని ద్వారా నిందితుడు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్టు గుర్తించి, అరెస్ట్ చేశారు. తోమర్ పాంధురాలోని ఒక ఏజెన్సీ నుంచి ఎల్పీజీ సిలిండర్ పొందుతున్నట్లు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా వెల్లడయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ ద్వారా అతడి అడ్రస్‌ను కనిపెట్టి అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..