JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
- బుల్డోజర్ల తయారీ సంస్థ జేసీబీ కొత్త ప్రపంచ రికార్డు
- గంటకు 653 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల హైడ్రోజన్ కారు
- BMW H2R రికార్డు బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JCB Hydrogen Car: సాధారణంగా నిర్మాణ రంగంలో ఉపయోగించే భారీ యంత్రాలు, బుల్డోజర్లతో గుర్తింపు పొందిన బ్రిటిష్ సంస్థ JCB ఇప్పుడు మరో ఘనత సాధించింది. సంస్థ అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌తో నడిచే HydroMax స్పీడ్ కార్ కొత్త వరల్డ్ ఎర్త్ స్పీడ్ రికార్డును నెలకొల్పింది. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ Bonneville Salt Flatsలో నిర్వహించిన రికార్డు ప్రయత్నంలో HydroMax గరిష్టంగా గంటకు 663.26 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రెండు పరుగుల సగటు వేగం గంటకు 653.90 కిలోమీటర్లుగా నమోదైంది.
హైడ్రోజన్ కారుతో కొత్త ప్రపంచ రికార్డు
JCB ప్రకారం, HydroMax హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించే అంతర్గత కంబుషన్ ఇంజిన్ టెక్నాలజీ తో రూపొందించారు. ఈ వాహనం రికార్డు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. రికార్డు ప్రయత్నంలో మొదటి పరుగులో కారు గంటకు 644.74 కిలోమీటర్ల సగటు వేగాన్ని నమోదు చేసింది. రెండో పరుగులో గంటకు 663.26 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ రెండు పరుగుల సగటుతో గంటకు 653.90 కిలోమీటర్ల కొత్త రికార్డు నమోదైంది.
Also Read
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
- Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
BMW H2R రికార్డు బద్దలు
ఈ ఘనతతో గతంలో హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు ఉన్న స్పీడ్ రికార్డును HydroMax అధిగమించింది. 2024లో BMW H2R గంటకు 298.53 కిలోమీటర్ల వేగంతో రికార్డు నమోదు చేసింది. HydroMax ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించి, హైడ్రోజన్ ఆధారిత వాహనాల వేగ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
1,622 హార్స్పవర్ సామర్థ్యం
HydroMax సుమారు 9.75 మీటర్ల పొడవు కలిగిన ప్రత్యేక స్పీడ్ కార్. ఇందులో రెండు హైడ్రోజన్ కంబుషన్ ఇంజిన్లు అమర్చారు. ఈ రెండు ఇంజిన్లు కలిపి సుమారు 1,622 hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అధిక వేగంతో పాటు Bonneville Salt Flats ప్రాంతంలోని పరిస్థితులను ఎదుర్కొనేలా ఇంజిన్లకు ప్రత్యేక సాంకేతిక మార్పులు చేశారు. హై ఆల్టిట్యూడ్ లో కూడా అవసరమైన పనితీరును అందించేందుకు సింగిల్-స్టేజ్ మోటార్‌స్పోర్ట్ టర్బోచార్జర్లను ఉపయోగించారు. ఇంజిన్లలో లే మాన్స్ రేసింగ్ కార్ల కోసం రూపొందించిన ప్రత్యేక స్పార్క్ ప్లగ్‌లను కూడా ఉపయోగించినట్లు JCB తెలిపింది.
ముందు, వెనుక చక్రాలకు ప్రత్యేక ఇంజిన్లు
HydroMax డిజైన్‌లో మరో ప్రత్యేకత రెండు ఇంజిన్ల అమరిక. వాహనం ఛాసిస్‌కు ఇరువైపులా ఒక్కో ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. ఒక ఇంజిన్ ముందు చక్రాలకు, మరో ఇంజిన్ వెనుక చక్రాలకు శక్తిని అందిస్తుంది. ప్రతి ఇంజిన్‌ను ప్రత్యేక 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు. ఈ వ్యవస్థ అధిక వేగంలో వాహనానికి అవసరమైన శక్తి పంపిణీని అందించేందుకు రూపొందించారు.
JCB డిగ్గర్లోని క్లచ్నే ఉపయోగించారు
HydroMaxలో ఉపయోగించిన మరో ఆసక్తికరమైన భాగం దాని క్లచ్. సాధారణ మోటార్‌స్పోర్ట్ క్లచ్‌లు ఈ రికార్డు వాహనంపై ఏర్పడే భారీ భారాన్ని తట్టుకోలేవని గుర్తించిన JCB, తమ సొంత JCB డిగ్గర్ నుంచి క్లచ్‌ను తీసుకుని ఉపయోగించినట్లు సంస్థ వెల్లడించింది. ఇది నిర్మాణ యంత్రాల తయారీలో తన అనుభవాన్ని హై-స్పీడ్ మోటార్‌స్పోర్ట్ సాంకేతికతతో కలిపిన ఆసక్తికరమైన ఉదాహరణగా నిలిచింది.
ఆండీ గ్రీన్‌కు మూడో ప్రపంచ రికార్డు
ఈ రికార్డులో డ్రైవర్ ఆండీ గ్రీన్ కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఇది మూడో ప్రపంచ ఎర్త్ స్పీడ్ రికార్డు. 1997లో Thrust SSC ద్వారా ధ్వని వేగాన్ని అధిగమించిన రికార్డులో ఆండీ గ్రీన్ కీలక పాత్ర పోషించారు. అనంతరం 2006లో JCB Dieselmaxతో డీజిల్ ఆధారిత వాహనానికి ప్రపంచ భూ వేగ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు HydroMaxతో హైడ్రోజన్ కంబుషన్ వాహన విభాగంలో మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
భవిష్యత్ హైడ్రోజన్ టెక్నాలజీకి సంకేతం
ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ ఆధారిత వాహన సాంకేతికతపై కూడా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. HydroMax రికార్డు హైడ్రోజన్ అంతర్గత దహన ఇంజిన్లకు ఉన్న అధిక పనితీరు సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అయితే ఇది సాధారణ రోడ్లపై నడిచే కారు కాదు. ప్రత్యేకంగా భూ వేగ రికార్డు కోసం రూపొందించిన అత్యంత అధునాతన ప్రయోగాత్మక వాహనం.
అయినప్పటికీ, హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించే దహన ఇంజిన్ల సామర్థ్యాన్ని నిరూపించడంలో ఈ రికార్డు కీలక ముందడుగుగా నిలిచింది. JCB బుల్డోజర్లు, డిగ్గర్ల తయారీ సంస్థగా మాత్రమే కాకుండా హైడ్రోజన్ ఇంజిన్ టెక్నాలజీలోనూ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుకుంది. గంటకు 653.90 కిలోమీటర్ల సగటు వేగంతో సాధించిన ఈ రికార్డు హైడ్రోజన్ వాహనాల భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరతీసింది.
ALERT: Hydrogen-powered car shatters the land speed record after a $100 million investment.
The JCB Hydromax made 2 runs at the Bonneville Salt Flats in Utah, the first at 400.632 MPH and the second at 412.135, averaging 406.32 MPH.
The previous record for a hydrogen-powered… pic.twitter.com/pW3TDvBumR
— E X X ➠A L E R T S (@ExxAlerts) August 13, 2026
తాజావార్తలు
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
-
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!