Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎంపీతో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు నేడో రోపో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటివారం మధ్యలో పోలింగ్ జరిగే ఉందని సోర్సెస్ చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శాయశక్తులు ఒడ్డుతోంది. గత దశాబ్ధకాలం నుంచి మధ్యప్రదేశ్ లో బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా.. జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటులో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Read Also: Aditya L-1:ఆదిత్య ఎల్ 1ని సరైన మార్గంలో ఉంచేందుకు ఇస్రో కీలక ఆపరేషన్
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్ నాథ్ అని పార్టీ కీలకనేత రణదీప్ సూర్జేవాలా శనివారం అన్నారు. విలేకరులు అడికిన ప్రశ్నకు బదులిస్తూ సహజంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే సీఎం ఫేస్ అవుతారని ఆయన అన్నారు. కమల్ నాథ్ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ అని, ఆయనే సీఎం అభ్యర్థి అని సూర్జేవాలా అన్నారు.
ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. అయితే వచ్చే సమావేశంలో సీట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని సూర్జేవాల వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాక్యానించారు. మధ్యప్రదేశ్ రాజకీయ పరిస్థితులను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విధ్వంస మార్గంలో తీసుకెళ్తున్నారని, అవినీతి పెరిగిపోయిందని, మధ్యప్రదేశ్ ప్రజలు మార్పు కోరకుకుంటున్నారని ఆయన అన్నారు. సీట్లపై అభ్యర్థుల ఎంపికపై చర్చించి 5-6 రోజుల్లో నిర్ణయం తీసుకుని జాబితా వెల్లడిస్తామని తెలిపారు.