గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. "కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క. నన్ను రాక్షసుడు అంటున్నావ్.. ప్రజల కోసం నేను రాక్షసుడినే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే. అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్ధాల కోరు. తెలంగాణ ద్రోహి. తెలంగాణా కోసం నువ్వేం చేశావ్.. తెలంగాణా కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 1982లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన మధుసూదనాచారి.. 1994-99 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో…