ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పైరసీ, టికెట్ రేట్ల సమస్యలతో పాటు సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాల గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొంతమంది పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ ఫెయిల్ అయ్యింది. దాన్ని అరికట్టడంలో మరింత కృషి చేయాలి. నిర్మాతల మండలి కూడా…