‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన సాధారణ ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా? అన్పించక మానదు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్ ప్రకాష్ రాజ్ ప్యానల్ పై నాన్ లోకల్ నినాదంతో ముందుకు సాగుతోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తుతూ తెలుగు చిత్ర సీమలో ‘నాన్ లోకల్’ అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై స్పందించిన ప్రకాష్ రాజ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
Read Also: మరో అమానవీయ ఘటన… మానవజాతి తుడిచి పెట్టుకుపోయే సమయం !
మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరి కంటే తాను తెలుగు బాగా మాట్లాడగలనని, ‘మా’ ఎన్నికలపై ప్రశ్నించినందుకు బెదిరించారని ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. ‘మా’ ఎన్నికలలోకి జగన్, కేసీఆర్, బీజేపీని ఎందుకు లాగుతున్నారు ? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీ బంధువైతే… ‘మా’ ఎన్నికలకు వస్తారా ? రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా ? అని ప్రశ్నించారు. తనకు సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసనీ, నటుడు నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
#MAAElections ..సాయాలు, చందాలు,ఉచితాలతోనే
— Prakash Raj (@prakashraaj) October 4, 2021
బ్రతుకుదామా ???
ఆల్ లైట్స్ ,,యాక్షన్ లతో
పనిచేస్తూ జీవిద్దామా..??
అడుగు, ఆలోచన, ఆచరణ…
"మా"కోసం ,మా సభ్యుడి క్షేమంకోసం https://t.co/h7b6XaXQyC pic.twitter.com/x9B4oWsh6j