తెలుగునాట పుట్టినా, భారతీయ చిత్రసీమలోనే తనదైన బాణీ పలికిస్తూ సాగిన ఘనులు దర్శకనిర్మాత నటులు ఎల్.వి.ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. భారతదేశంలోని ప్రధాన చిత్రపరిశ్రమల్లో ఎల్వీ ప్రసాద్ అన్నది ఓ బ్రాండ్ నేమ్. వారి ప్రసాద్ ల్యాబ్స్ , ఔట్ డోర్ యూనిట్స్ , ఇఎఫ్ఎక్స్ , ప్రసాద్ ఐమాక్స్ అన్నీ సినీజనానికి సుపరిచితాలు.…
(ఎల్వీ ప్రసాద్ జయంతి జనవరి 17న)తెలుగు చిత్రపరిశ్రమకు ఓ వెలుగును తీసుకు వచ్చారు దర్శకనిర్మాత నటుడు ఎల్వీ ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో ఎల్.వి. ప్రసాద్ పేరు తెలియని వారుండరు. ఈ తరం వారికి ఆయన స్థాపించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ తప్పకుండా గుర్తుంటుంది. భారతదేశంలోని ప్రధాన…
(ఆగస్టు 30న రమేశ్ ప్రసాద్ పుట్టినరోజు) ఓ వైపు హైటెక్ సిటీ, మరో వైపు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ భాగ్యనగరానికి మరింత శోభను తీసుకు వచ్చాయి. ప్రసాద్ సంస్థ తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు మరెవరో కాదు ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు ఎల్.వి.ప్రసాద్. ఆయన నెలకొల్పిన ప్రసాద్ సంస్థలు అనేకం చిత్రసీమలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ లో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ విషయం అందరికీ తెలిసిందే.…