Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Remembering Legendary Director Lv Prasad On His Birth Anniversary

పసందైన చిత్రాల ఎల్వీ ప్రసాద్

Published Date :January 17, 2022 , 6:57 am
By Prakash
పసందైన చిత్రాల ఎల్వీ ప్రసాద్
  • Follow Us :
  • google news
  • dailyhunt

(ఎల్వీ ప్రసాద్ జయంతి జనవరి 17న)
తెలుగు చిత్రపరిశ్రమకు ఓ వెలుగును తీసుకు వచ్చారు దర్శకనిర్మాత నటుడు ఎల్వీ ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో ఎల్.వి. ప్రసాద్ పేరు తెలియని వారుండరు. ఈ తరం వారికి ఆయన స్థాపించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ తప్పకుండా గుర్తుంటుంది. భారతదేశంలోని ప్రధాన చిత్రపరిశ్రమల్లో ఎల్వీ ప్రసాద్ అన్నది ఓ బ్రాండ్ నేమ్! వారి ప్రసాద్ ల్యాబ్స్ , ఔట్ డోర్ యూనిట్స్ , ఇఎఫ్ఎక్స్ , ప్రసాద్ ఐమాక్స్ అన్నీ సినీజనానికి సుపరిచితాలు. తాను చిత్రసీమలో సంపాదించినది, మళ్ళీ సినిమా రంగంలోనే పెట్టుబడిగా పెట్టారు ప్రసాద్. ఇక ఐ ఇన్ స్టిట్యూట్ నిర్మాణంలోనూ స్వార్థముందని చెప్పారు. ఎందుకంటే తమ ఐ ఇన్ స్టిట్యూట్ లో చికిత్స పొందిన వారు కళ్ళు బాగయితే మళ్ళీ సినిమాలు చూస్తారు కదా అన్నది ఆయన మాట! అలాగే నేడు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ దేశవ్యాప్తంగా పేరొందింది.

ప్రసాద్‌ పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవర ప్రసాద రావు. 1908 జనవరి 17న పశ్చిమ గోదావరి ఏలూరు తాలూకా సోమవారప్పాడులో జన్మించారు. చిన్నతనం నుంచీ చదువులో అంత ఆసక్తి చూపించేవారు కాదు. 17 ఏళ్ళ వయసులో ప్రసాద్ కు వివాహమయింది. ఓ బిడ్డ పుట్టిన తరువాత ఇంటి నుండి పోయి, సినిమా రంగంలో రాణించాలని తపించారు.
ఎల్వీ ప్రసాద్ కు తొలి నుంచీ ఏదో సాధించాలన్న తపన ఉండేది… పెళ్ళయి ఓ బిడ్డ తండ్రి అయిన తరువాతే, ముంబయ్ వెళ్ళి అక్కడ పలు పాట్లు పడ్డారు… చిత్రసీమలోనే రాణించాలని ఆశించారు… థియేటర్ గేట్ కీపర్ గా పనిచేశారు… స్టూడియోల్లోనూ పనిచేసి, తిన్నగా సినిమాల్లో వేషాలూ సంపాదించారు… భారతీయుల తొలి టాకీ చిత్రం ‘ఆలమ్ అరా’లోనూ, తెలుగువారి తొలి మాటల సినిమా ‘భక్త ప్రహ్లాద’లోనూ, తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన ‘కాళిదాస’లోనూ ప్రసాద్ నటించారు… అలా మూడు చోట్లా తొలి టాకీస్ లో నటించడం ఓ రికార్డు…

ప్రసాద్ నటిస్తూనే కొంతమంది దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. సారథీ సంస్థ నిర్మించిన ‘గృహప్రవేశం’తో ఆయన దర్శకుడయ్యారు.ఈ చిత్రంలో కథానాయకుడు కూడా ఆయనే కావడం విశేషం. గూడవల్లి రామబ్రహ్మం ఆరంభించిన ‘పల్నాటి యుద్ధం’ చిత్రం ఆయన మరణంతో ఆగిపోయింది. ఎల్వీ ప్రసాద్ దర్శకునిగా పగ్గాలు చేతబూని ఆ సినిమాను పూర్తిచేశారు. తరువాత ఎమ్.ఆర్.ఏ. ప్రొడక్షన్స్ సంస్థాధినేత పి.కృష్ణవేణి తాము నిర్మించే ‘మనదేశం’ చిత్రానికి ప్రసాద్ ను దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో ఆ నాటి మేటి నటులు చిత్తూరు నాగయ్య, సిహెచ్. నారాయణరావు నటించారు… ఇక కృష్ణవేణి నాయికగా మురిపించారు. ఈ చిత్రంతోనే యన్టీఆర్ చిత్రసీమలో అడుగు పెట్టారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ తొలి చిత్రం ‘షావుకారు’కు దర్శకత్వం వహించిన ఎల్వీ ప్రసాద్, ఆ సంస్థ నిర్మించిన మరో సాంఘిక చిత్రం ‘పెళ్ళి చేసి చూడు’కూ నిర్దేశకత్వం వహించారు. ఈ చిత్రం 1952 ఫిబ్రవరి 29న లీపు సంవత్సరం కానుకగా విడుదలై విజయదుందుభి మోగించింది. ఇప్పటి దాకా ఫిబ్రవరి 29న విడుదలైన ఏ చిత్రమూ అంతటి విజయాన్ని చవిచూడక పోవడం విశేషం విజయా సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించిన ‘మిస్సమ్మ’కూ ప్రసాదే దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన చివరగా దర్శకత్వం వహించిన చిత్రం ‘అప్పుచేసి పప్పుకూడు’. ఈ సినిమా కూడా విజయా సంస్థ నిర్మించినదే.

ప్రసాద్ చిత్రాల ద్వారా ఎందరో మహానటులు వెలుగు చూశారు. ఇక తెలుగువారికి ఎల్వీ ప్రసాద్ గుర్తుండటానికి ముఖ్యకారణం – మహానటుడు యన్టీఆర్ ను తెరకు పరిచయం చేసింది ఆయనే కాబట్టి. ఇక తమిళ నాటకరంగంలో రాణిస్తున్న శివాజీగణేశన్ ను తన దర్శకత్వంలో రూపొందిన ‘పరదేశి’ ద్వారా తెరకు పరిచయం చేశారు ప్రసాద్ .నిజానికి ఇదే శివాజీగణేశన్ తొలి చిత్రం. అయితే తమిళంలో ఆయన నటించిన ‘పరాశక్తి’ ముందుగా విడుదలయింది. ఆ తరువాత ప్రసాద్ తెరకెక్కించిన ‘మనోహర’ చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు శివాజీగణేశన్.
అప్పటి దాకా జానపద చిత్రాలతోనే సాగుతోన్న ఏయన్నార్ ను తన ‘సంసారం’తో సాంఘిక చిత్రాలకు పరిచయం చేశారు. ఈ చిత్రంలోనే ఓ పాటలో మెరుపుతీగెలా కనిపించారు సావిత్రి. ఇక సావిత్రిని నటిగా ‘పెళ్ళిచేసి చూడు’లో తీర్చిదిద్దిందీ ప్రసాదే. తరువాత ‘మిస్సమ్మ’గా సావిత్రిని జనం మదిలో నిలిపిందీ ఆయనే. ‘మిస్సమ్మ’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రసాద్ దర్శకత్వంలోనే రూపొందింది. ఈ మూడు చిత్రాలలోనూ జమున నటించడం విశేషం.

తరువాతి రోజుల్లో ఎల్వీ ప్రసాద్ నిర్మాతగా మారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలను నిర్మించారు. తాను నిర్మాతగా వ్యవహరిస్తూ డి.యోగానంద్ దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి ప్రధాన పాత్రల్లో ‘ఇలవేల్పు’ చిత్రం తెరకెక్కించారు. ఇదే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ‘శారద’ పేరుతో హిందీలో నిర్మించారు… రాజ్ కపూర్, మీనాకుమారి ఇందులో నటించారు… ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రసాద్ నిర్మాతగానూ ఉత్తరాదిన మంచి పేరు సంపాదించారు… ఆపై దక్షిణాదిన విజయం సాధించిన పలు చిత్రాలను హిందీలో నిర్మించారు ప్రసాద్. 1978లో కె. బాలచందర్ తెరకెక్కించిన తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ ఘనవిజయం సాధించింది… ఈ సినిమాను బాలచందర్ దర్శకత్వంలోనే హిందీలో ‘ఏక్ దూజే కేలియే’ పేరుతో రీమేక్ చేశారు ప్రసాద్. ‘ఏక్ దూజే కేలియే’తోనే కమల్ హాసన్ తొలిసారి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాడు. హిందీలోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

కమల్ హాసన్ నిర్మించిన తొలి చిత్రం ‘రాజా పారవై’. తెలుగులో ఈ సినిమా ‘అమావాస్య చంద్రుడు’గా విడుదలయింది. ఈ చిత్రంలో ఎల్వీ ప్రసాద్ ను హీరోయిన్ తాత పాత్రలో నటించారు. అలా నిర్మాతగా కమల్ తొలి చిత్రం ఎల్వీ ప్రసాద్ కు నటునిగా చివరి చిత్రం కావడం విశేషం.

భారతీయ సినిమా రంగంలో ఎల్వీ ప్రసాద్ ఓ వటవృక్షం. ఆయన నీడన ఎందరో కళాకారులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రాణించి, చిత్రసీమలో చోటు సంపాదించగలిగారు. చిత్రసీమలో తాను సంపాదించినది, అందులోనే పెట్టుబడిగా పెట్టి అనేక శాఖలకు విస్తరించారు. తెలుగు చిత్రసీమకే కాదు భారతీయ సినిమారంగానికే ఎల్వీ ప్రసాద్ చేసిన సేవలు మరపురానివి…మరువలేనివి…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director LV Prasad
  • Legendary Director LV Prasad
  • LV Prasad
  • LV PRasad Birth Anniversary
  • Tollywood

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions