నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తాజా అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలి కాలుష్యం దోహదం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే సిగరేట్ తాగడం, ఇతరులు వదిలిన పొగతో పోలిస్తే ఊపిరితిత్తి క్యాన్సర్‌కు గాలిలోని నుసి పదార్థం ఎంతవరకు దోహదం చేస్తోందనేది తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఊపిరితిత్తి క్యాన్సర్ అనేది కేవలం పొగతాగేవారికే వచ్చే జబ్బుగా పరిగణించేవాళ్లం.