Parks Closed: హైదరాబాద్‌లో గురువారం పార్కులను మూసివేయనున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సచివాలయం పరిసర ప్రాంతాల్లోని పార్కులకు హెచ్‌ఎండీఏ సెలవు ప్రకటించింది. పార్కుల వద్దకు వచ్చే ప్రజలకు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్‌లను మూసివేయనున్నట్టు తెలిపారు. రేపు ఉదయం నుంచే అమలులో ఉంటాయని పేర్కొంది. అంతే కాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని ప్రయాణికులు ప్రత్యాన్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించింది. ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కింది. రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సూచించి. సచివాలయం పరిసరాల్లో వున్న పార్కులు, దారులు అన్నీ మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు, హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు. ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుకు ఎదుర్కొకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని కోరారు.
Read also: Salaar: ‘సలార్’ ఊహించని అప్డేట్… గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో కొత్త యూనివర్స్
సీఎం కేసీఆర్ అమరుల అఖండ జ్యోతిని రేపు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఒకవైపు హుస్సేన్‌సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీన్ని నిర్మించారు. 177.50 కోట్లు వెచ్చించి ఈ నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో దీన్ని తయారు చేయడం దీని ప్రత్యేకత. 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మ్యూజియం, 100 మంది సీటింగ్ కెపాసిటీతో ఆడియో విజువల్ హాల్, 650 మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్, టూరిస్టులకు రెస్టారెంట్, ఇతర సౌకర్యాలు, 350 మందికి పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి. భవనం నిర్మిత ప్రాంతం 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్‌సాగర్ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లామందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలను వీక్షించేందుకు టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారక్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ముగింపు పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.
Beer Yoga: డెన్మార్క్ లో బీర్ యోగాపై భారతీయుల ఆగ్రహం