LRS Date Extended: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. మునుపటి గడువు మార్చి 31వ తేదీతో పూర్తవుతుండడంతో, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లింపు వారికి 25 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. Read Also: Siddaramaiah: ఇరకాటంలో కర్ణాటక సీఎం.. ముడా…
బీఆర్ఎస్ ఎస్‌ఆర్‌ఎస్‌పై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా ఆరోపణలు చేసినా.. అంతిమంగా తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ని రద్దు చేసి... పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా ప్లాట్లు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా... ఇప్పటిదాకా ఆ ఊసే లేదంటూ... విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ.
Payment with Credit Card: విదేశీ యాత్రలకు వెళ్లేవాళ్లకి ముఖ్య గమనిక. టికెట్లు బుక్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రూలు అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు వసూలు చేస్తున్న.. ఈ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్.. టీసీఎస్.. 5 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం.