తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్‌లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.
Husband Murder: ఈ రోజుల్లో ఆస్తికోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన వాళ్లను కూడా ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్(54) హత్యకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ సమీపంలో హత్య చేసి ఊటీ ఎస్టేట్‌లో ఆయన మృతదేహాన్ని తగులబెట్టారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. భార్య నిహారిక, ఆమె…
ప్రేమించానని మాయ మాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా శ్వాస, నువ్వే నా జీవితం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి దాదాపు ఏడేళ్లు ఆ అమ్మాయితో కలిసి తిరిగాడు. చివరకు పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడగగానే ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ, లైఫ్ ఎంజాయ్ చేద్దామంటూ దాట వేసుకుంటూ వచ్చాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటి అని ప్రేమించిన అమ్మాయి గట్టిగా నిలదీస్తే..…
Vizag: విశాఖపట్నంలో అర్ధరాత్రి ఓ వివాహితపై హత్యయత్నం తీవ్ర కలకలం రేపుతుంది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని HB కాలనీ, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో మధ్య వివాహితపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
తిరుపతిలో సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.
Wife Kills Husband: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేద్దామనుకుంది భార్య. అందుకోసం అతన్ని ఇంటికి పిలిపించుకుంది. కానీ.. కుటుంబ సభ్యులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈ ఘటన యూపీలోని మహారాజ్‌గంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరు కావడం కోసం వెళ్ళాడు. ఈ క్రమంలో.. భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.