విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. కింగ్ కోహ్లి భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే టాప్ ఫీల్డర్‌లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ.. అద్భుతంగా మైదనమంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాడు. రేపు ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అయితే కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.