Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.
కరోనా వచ్చి పోయినవారిలో దీర్ఘకాలికంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో లక్షలాది మంది ఆ మహమ్మారి బారినపడ్డారు.. కొంతమందిలో లక్షణాలు లేకుండా వైరస్ సోకడం.. తిరిగి కోలుకోవడం కూడా జరిగిపోయాయి.. వైరస్ సోకిందనే భయంతో ఎంతో మంది ప్రాణాలు కూడా విడిచారు. అయితే, కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్కోవిడ్తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.. మొత్తం 1,038 మందిపై పరిశోధన నిర్వహించగా.. వారిలో…
అంతా అయిపోయింది. మనం ఇక సేఫ్ అనుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా…అదుపులోనే ఉందా? అంటే ఇంకా లేదనే చెప్పాలి. కొవిడ్ సృష్టించిన విలయం నుంచి దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్ సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు వస్తున్నాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. చైనాలో కోవిడ్ కేసులు 50 వేలకు పైగా నమోదవడం మరో మృత్యుఘంటికలు మోగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ… అది సృష్టించిన విలయం…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా బారిన పడిన రోగులపై బ్రిటన్ కు చెందిన యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా బారిన పడిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కోవిడ్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. బ్రెయిన్ ఫాగ్ నుంచి చెవిలో మోత వరకు అనేక సమస్యలతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వ్యక్తుల్లో సుమారు 200 రకాల సమస్యలను గుర్తించినట్టు యూనివర్శిటి ఆఫ్ లండన్…
భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ ఓ కుదుపు కుదిపేసింది.. కరోనాబారినపడినవారి సంఖ్య పెరగడమే కాదు.. కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, కోవిడ్ బారినపడినవారి ఒళ్లు గుల్లైపోతోంది.. కరోనా నుంచి కోలుకున్నతర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వారు ఐదారు నెలల పాటు కరోనా లక్షణాలతో సతమతమవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ పరిస్థితికి వైద్య పరిభాషలో లాంగ్ కోవిడ్ అనే పేరు పెట్టారు. ఈ…