టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు.. నేరం చెయ్యలేదని ఎక్కడా చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు. దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారని.. అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారని ఆరోపించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉదయం నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి నారా లోకేష్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. లోకేశ్ పై ఈ కేసులో ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు మెంటల్లీ సిక్ అని చెప్పి జైలుకు తీసుకువస్తావా పవన్? పోసాని కృష్ణమురళి అడిగారు. అసలేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా పవన్?.. కాపు నాయకుడ్ని, లెజెండ్ ని చంపిన దుర్మార్గుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తావా పవన్.. కాపు వ్యతిరేకి చంద్రబాబు.. మీరు ఎవర్నైనా ఎన్నుకోండి.. ఎవరికైనా ఓట్లు వేయండి కానీ చంద్రబాబుకు వేయకండి అని ఆయన కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడు అంటూ ఆయన విమర్శించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.
ఫ్లెక్సీ వార్ పై వర్గపోరుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు స్పందించారు. తెలుగు తమ్ముళ్లు ఒక మహిళా సర్పంచ్ పై దాడికి దిగడం ఆ పార్టీ దిగజారుడు తనాన్ని బయటపడుతుందని ఎద్దేవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎక్కడ జరిగినా.. వారి వర్గపోరు బహిర్గతం అవుతుందని అన్నారు. లోకేశ్ నిర్వహించే పాదయాత్ర.. యువగళం కాదని గొడవలగళంగా వర్ణించారు.
చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.