లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు.
టీడీపీ- జనసేన పార్టీల పొత్తులపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు.. పాడుతా తీయగా కార్యక్రమంలాగా ఇటు ఆరుగురు ఆడు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు.. ఆర సున్న.. ఆర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించారు అనడం కామెడిగా ఉంది అని ఆమె సెటైర్లు వేశారు.
టీడీపీ-జనసేన జేఏసీ మీటింగ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విధానం ఏంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని తప్పు బడుతున్నామన్నారు. 2014లో కలిసి పోటీ చేశావ్... 2019లో విడిగా పోటీ చేశావ్.. ఏం చేసినా చంద్రబాబుకు ప్రయోజనం కలిగించటమే పవన్…
ఇవాళ్టి సమావేశం హిస్టారికల్ మీటింగ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
Leo cinematographer reveals a shocking twist of flashback: లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న తమిళ సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇక తాజాగా లియో సినిమాటోగ్రాఫర్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. లియో థియేటర్లలో విడుదలైనప్పటి నుండి, లియో ఫ్లాష్‌బ్యాక్‌కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే.…
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం పై హాట్ కామెంట్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబుకు ఆయన కొడుకు కోవర్టుగా పనిచేయడానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని తెలిపారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమని తెలిపారు.
ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు.