Lok Sanha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది.