మరియమ్మ లాకప్ డెత్ చాలా దురదృష్టకరం అని అన్నారు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అప్పుడు కనీసం మహిళ పోలీసులు లేరు సిగ్గుచేటు. లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా అని అడిగారు. రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన చాలా దుఃఖం…
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ సంచలనంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తి.. అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు పాస్టర్.. మొదట మరియమ్మ, ఆతర్వాత ఆమె కొడుకు ఉదయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు..…