మరియమ్మ లాకప్ డెత్ చాలా దురదృష్టకరం అని అన్నారు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అప్పుడు కనీసం మహిళ పోలీసులు లేరు సిగ్గుచేటు. లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా అని అడిగారు. రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన చాలా దుఃఖం తెప్పించింది. జస్టిస్ ఫర్ అల్ కోసం అందరం పోరాటం చేద్దాం. సామాజిక న్యాయం కోసం అంబేత్కర్ ఎన్నో కలలు కన్నారు. ఇందుకోసం మనము ఊరు ఊరు.. ఇల్లు ఇళ్లు తిరిగి పోరాటం చేద్దాం అందరిని చైత్యణ్యం చేద్దాం. మరియమ్మ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ నిరంతరము పోరాటం చేస్తుంది. మీ పోరాటానికి నా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది అని పేర్కొన్నారు.