Corona : సింగపూర్‌లో కలకలం రేపుతున్న మరో కరోనా వేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona : కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతలా భయపెట్టిందో తెలుసుకదా.. మహమ్మారి ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం అయిపోయాయి. కోట్ల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డున పడ్డారు. జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఒక శకానికి సరిపడా చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కరోనా నివారణకు పలు దేశాలు ఇప్పటికీ లాక్ డౌన్ మంత్రం పాటిస్తున్నాయి. కానీ వైరస్ ప్రభావం తగ్గడం లేదు. మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటూ విజృంభిస్తోంది.
Read Also: Taiwan China: తగ్గేదేలే అంటున్న తైవాన్.. చైనా ఆధిపత్యంపై జిన్ పింగ్‌కు వార్నింగ్
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
తాజాగా సింగపూరులో మరో కొత్త కరోనా వేవ్‌ను ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ వైద్యులు గుర్తించారు. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, డెన్‌మార్క్, భారత్, జపాన్‌తో సహా 17 దేశాల్లో ఈ కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభణతో తమ దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని ఓంగ్ యే కుంగ్ వెల్లడించారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా తిరిగి వ్యాపిస్తుందని తెలిపారు.
Read Also:Hansika: పెళ్లి పీటలు ఎక్కనున్న దేశముదురు బ్యూటీ.. వెన్యూ ఎక్కడంటే..?
మరోవైపు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ వల్ల కరోనా కేసులు నవంబర్ నెల మధ్యలో గరిష్ఠస్థాయికి చేరవచ్చని తెలిపింది సింగపూర్ ప్రభుత్వం. ఈ వేవ్ పీక్ స్టేజ్‌లో ప్రతి రోజు సగటున 15,000 కేసులు నమోదు కావచ్చని అంచనా వేసింది సింగపూర్ ప్రభుత్వం. అయితే ఈ వేవ్ స్వల్ప కాలం పాటు ఉండవచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు. తాజా కరోనా పరిస్థితిని, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అవసరమైతే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయడంతోపాటు సురక్షిత పద్ధతులను అమలు చేస్తామని ఓంగ్ యే కుంగ్ అన్నారు. వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అక్టోబర్ 14 నాటికి సింగపూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,997,847కు, మొత్తం మరణాల సంఖ్య 1,641కు చేరింది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!