China: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో నానావస్థలు పడ్డ ప్రజలు. ఒమిక్రాన్ నుంచి ప్రమాదకారిగా భావిస్తున్న రెండు ఉపవేరియంట్లు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మూడు రెట్ల కొత్త కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
Read Also: China: మూడో సారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్..?
కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ నుంచి బీఎఫ్7, బీఏ 5.1.7ఉప వేరియంట్లు వాయువ్య చైనాలో ఎక్కువగా విజృంభిస్తున్నాయి. వీటి బారిన పడ్డ చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదే సమయంలో బీఏ 5.1.7ఉప వేరియంట్లు తొలిసారి డ్రాగన్ కంట్రిపై వెలుగు చూశాయి. ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ ధృవీకరించింది. షాంగైతో పాటు చాలా రీజియన్లలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు అధికారులు.
Read Also:Facebook : జుకర్ బర్గ్కు పుతిన్ షాక్.. తీవ్రవాద సంస్థల జాబితాలో ఫేస్ బుక్
కరోనా సబ్ వేరియంట్ల ప్రభావం చైనాతో ఆగిపోవని ప్రపంచదేశాలకు వ్యాపించే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చిరిస్తోంది. కట్టుదిట్టమైన కఠోర కరోనా ఆంక్షలను అమలు చేస్తోంది చైనా దేశం. జీరో కోవిద్ పాలసీ విధానంతో ప్రజల నుంచి ఎన్ని విమర్శలను వచ్చినా మహమ్మారి కట్టడికి యత్నిస్తోంది. అయినప్పటికీ వైరస్ ఉధృతి ఆగడం లేదు. కరోనా విజృంభణ వార్తలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.