కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో.. లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే తక్కువగా మారింది.