కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్‌జౌ నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల…
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయ్. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. Read Also : స్టోరీస్ ఎండ్… లవ్…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి కిందే ముగిసింది. వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద కెబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కెబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం…
లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్… ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, సడలింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత లాక్‌డౌన్ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పొడిగించారు.. ఇదే సమయంలో.. సడలింపులు సమయాన్ని పెంచుతూ.. లాక్‌డౌన్ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 10వ తేదీ…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల…
దేశ రాజధానిలో “లాక్ డౌన్” మరో వారం పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. దీంతో ఢిల్లీలో జూన్ 7వ తేదీ వరకు “లాక్ డౌన్” కొనసాగనుంది. అయితే, కొన్ని షరతులతో ఉత్పత్తి, నిర్మాణ రంగ వ్యాపారాలు పునఃప్రారంభానికి అనుమతులు ఇచ్చింది సర్కార్. తిరిగి పనులు ప్రారంభించే వ్యాపార సంస్థలు చాలా ఖచ్చితంగా “కరోనా” నిబంధనలు పాటించాలని..ఉద్యోగులు ఒకేసారి సమూహంగా విధుల్లోకి రాకుండా, పలు షిప్టులలో పనిచేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆయా…
కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల పనిపట్టారు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల ఏసిపి నరేందర్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దంటూ పలుమార్లు చెప్తున్నా వినట్లేదు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో కరోనా సోకుతుందని…
తెలంగాణలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. కాగా, మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీకి తేదీ…
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్ లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఇటీవలే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు ఫుడ్ డెలివరీ సంస్థలకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారంటూ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వడ్డించారు. దీనిపై డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని…