Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య ఒక గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) గుర్తు తెలియని దుండగుల చేతిలో బలైపోయాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది. విజయ్ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడికి…
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని…
Bumper Offer : బిర్యానీ… ఈ మాట వినగానే నోరూరని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సీజన్ అయినా బిర్యానీ హవా ఎప్పుడూ యథావిధిగా ఉంటుంది. పండగలైనా, వేడుకలైనా, బిర్యానీ లేకుండా ఏనాడు పూర్తవ్వదు. పార్టీలు అయినా, ప్రత్యేక రోజులు అయినా గెస్టుల కోసం బిర్యానీ ఆర్డర్ అనేది మస్ట్ ఐటమ్ అయిపోయింది. మన భారతీయుల జీవనశైలిలో అది విడదీయలేని భాగంగా మారిపోయింది. తాజాగా అనకాపల్లిలో ఒక హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా, నిర్వాహకులు విపరీతమైన ఆఫర్‌ను…
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షానికి నాని పాత మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.
కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు.