కరోనా తర్వాత ఎక్కువ మంది యూపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.. అందులో ఫోన్ పే కూడా ఒక్కటి.. తాజాగా ఫోన్‌పే తన కస్టమర్లకు తీపికబకురు అందించింది. కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవలు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఫోన్‌పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నెలవారీ చెలింపుతో కూడా కొనుగోలు చేయొచ్చు… ఈ ఇన్సూరెన్స్ గురించి వివరంగా…
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశ పెడుతుంది.. తాజాగా రైతులకు శుభవార్త చెబుతుంది.. రైతులకు ప్రత్యేకమైన సేవలు అందిస్తోంది.. కేవలం బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు మూడు లక్షలు ఇచ్చేస్తుంది.. అవునా?.. నిజామా? ఎలా మూడు లక్షలు పొందవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తీసుకువచ్చింది. మీరు ఎస్‌బీఐ సహా మరే ఇతర…
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు పెద్ద అడుగు వేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల కోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈరోజు ఆమోదించింది.
Byju’s : దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ బైజూస్ కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎందుకంటే బైజూస్ 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,800 కోట్ల రుణం కోసం దాదాపు 40 మిలియన్ డాలర్ల వాయిదా చెల్లించాల్సి వచ్చింది.
సాధారణ జీవనం గడిపే స్వీపర్ 16 కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవచ్చా.. ఇది వినడానికి తమాషాగా ఉన్నా.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు స్వీపర్ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది.
క్రెడిట్ కార్డును ఒక్కొక్కరు ఒకలా వాడేస్తున్నారు.. క్రెడిట్ కార్డులపై షాపింగ్ చేసేవాళ్లు, ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లు.. అద్దెలు చెల్లించేవాళ్లు, ఆ చెల్లింపుల పేరుతో డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించి వాడుకునేవారు ఇలా ఎన్నో రకాలుగా వాడేస్తు్నారు.. అంతేకాదు.. అవసరాలను బట్టి క్రెడిట్ కార్డులపై లోన్లు కూడా తీసుకుంటున్నారు.. కొన్ని సార్లు పరిమితి మేరకు ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఆయా బ్యాంకులు కలిపిస్తాయి.. అయితే, ఇది, ఆ క్రెడిట్ కార్డు లిమిట్ కంటే…
చిన్న చిన్న దేశాల అవసరాలను తెలుసుకొని వాటికి సహాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయడం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. గతంతో బ్రిటీష్ పాలకులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగన్ పాలకులు చేస్తున్నారు. పాక్‌కు కావాల్సనంత డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. ఇటు శ్రీలంకను సైతం అదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది డ్రాగన్. కాగా ఇప్పుడు దృష్టిని కువైట్‌వైపు మళ్లించింది. కువైట్ ప్రస్తుతం అల్ షకయా ఎకనామిక్ సిటీని…