కరోనా తర్వాత ఎక్కువ మంది యూపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.. అందులో ఫోన్ పే కూడా ఒక్కటి.. తాజాగా ఫోన్‌పే తన కస్టమర్లకు తీపికబకురు అందించింది. కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవలు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఫోన్‌పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నెలవారీ చెలింపుతో కూడా కొనుగోలు చేయొచ్చు… ఈ ఇన్సూరెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం..
హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సబంధించి ఆఫర్డబిలిటీ అనేది అతిపెద్ద అడ్డంకి అని తెలిపారు. నెలవారీ చెల్లింపుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చామని ఫోన్ పే అధినేత పేర్కొన్నారు. కాగా ఫోన్‌పే తన ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 56 లక్షల పాలసీలను విక్రయించింది. అలాగే దేశంలో 98 శాతం పిన్‌కోడ్స్‌కు సేవలు అందుబాటులో ఉంచింది…ఈ పాలసీలను తీసుకొనే వారు కోటి రూపాయల వరకు కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. పరిమితులు లేకుండా హాస్పిటల్ రూమ్ పొందొచ్చు. బోనస్ కవర్ ఆప్షన్ కూడా ఉంది. ప్రి, పోస్ట్ సేల్స్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఫోన్‌పే ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోల చేయాలని భావించే వారు ముందుగా యాప్‌లోకి వెళ్లాలి. ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత కోట్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు..
అయితే మీరు నెలవారీగా లేదంటే వార్షికంగా డబ్బులు చెల్లించొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు..మీరు రూ.5 లక్షల మొత్తానికి హెల్త్ పాలసీ తీసుకుంటే నెలవారీ పేమేంట్ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు దాదాపు రూ.950 పడుతుంది. క్యాష్‌లెస్ ఆప్షన్ ఉంది. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. కేర్ హెల్త్ ప్లాన్ తీసుకుంటే ఈ ప్రీమియం పడుతుంది. కాగా ఫోన్‌పే ఇటీవలనే కొత్త సేవలు తెచ్చింది..ఈ కొత్త సేవల వల్ల ఫోన్‌పే కూడా పూర్తిగా ఆఫ్‌లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా మారిపోయింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు స్వీకరించడం వల్ల వారి వ్యాపారం మరింత పెరుగుతందని ఫోన్‌పే ఆఫ్‌లైన్ బిజినెస్ హెడ్ తెలిపారు.. ఈ సేవల వల్ల కస్టమర్లు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు..