ఈమధ్య కాలంలో చెమటోడ్చి కష్టపడి సంపాదించేవారు చాలా తక్కువ అయిపోయారు. ఎంతసేపు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి పని చెప్పకుండా డబ్బులు సంపాదించే మార్గాలను శోధిస్తున్నారు. ఇకపోతే చాలామంది డబ్బులు వక్రమార్గంలో సంపాదిస్తున్నారు. కొందరు బతకడానికి దొంగతనాలు చేస్తుండగా.. మరికొందరు కొన్ని అడ్డదారుల్లో నడుస్తున్నారు. కొందరైతే బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు మద్యంను అక్రమంగా తీసుకోవచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల కంటే పక్క రాష్ట్రాలలో దొరికే మందు నాణ్యత బాగుండి, అలాగే వాటి రేట్లు తక్కువగా ఉండటం. ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి ఇలా మద్యం పక్క రాష్ట్రం నుంచి తీసుకోవచ్చి తెలంగాణ జిల్లాలో విక్రయించడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరంటే?
మామూలుగా ఎవరైనా సరే మగవారు చొక్కాలకు, ప్యాంట్లకు సాధారణంగా జోబులు పెట్టుకుంటారు. కాకపోతే అదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామానికి చెందిన మునిశ్వర్ సత్యనారాయణ అనే వ్యక్తి తన బనియన్ కు జేబులను కుట్టించాడు. అయితే అలా కేవలం ఒకటి రెండు కాదండోయ్.. ఏకంగా 54 జేబులను కుట్టించాడు. అయినా బనియన్ కు ఇన్ని జేబులు ఎందుకని ఆలోచిస్తున్నారు కదా.. అవును మరి ఆ వ్యక్తి చేసే పని అలాంటిది మరి.
Also read: Docter MLA: మహిళ కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్..!
సత్యనారాయణ తెలంగాణలోకి మహారాష్ట్ర నుండి మద్యం సీసాలను తీసుకువచ్చి అమ్ముతుంటాడు. ఇందులో భాగంగానే తాజాగా 48 దేసిదారు మద్యం సీసాలను స్మగ్లింగ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే అతను అదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కంట పడ్డాడు. ఇంకేముంది అతడి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు.