ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే మంగళవారానికి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్‌ను ఆగస్టు 12న ఢిల్లీ కోర్టు పరిశీలించాలని నిర్ణయించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఇండియా కూటమి రంగంలోకి దిగబోతుంది. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టై.. తీహార్ జైల్లో ఉంటున్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి జైల్లో ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ కలవనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి రోస్ అవెన్యూ కోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం ఆమె అభ్యర్థించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుట్రలో భాగంగానే ఈడీ తప్పుడు అరెస్ట్ చేసిందని సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియాను ఆమె విడుదల చేశారు. కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను ఆమె కోరారు.
సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీబీఐ స్పందనను న్యాయస్థానం కోరింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థనకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును జూలై 17న విచారణకు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు సాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాలుగో సంవత్సరం లా విద్యార్థి గురువారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు.