Sunita Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు
- కేజ్రీవాల్ అరెస్ట్‌పై సతీమణి సునీత కీలక వ్యాఖ్యలు
- ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్పుడు స్టేట్‌మెంట్‌తోనే అరెస్ట్
- వీడియో విడుదల చేసిన సునీతా కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుట్రలో భాగంగానే ఈడీ తప్పుడు అరెస్ట్ చేసిందని సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియాను ఆమె విడుదల చేశారు. కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను ఆమె కోరారు. నిజాయితీపరుడు, విద్యావంతుడు, దేశభక్తి గల వ్యక్తిని తప్పుడుగా ఇరికించారని ఆమె పేర్కొన్నారు. లోతైన రాజకీయ కుట్రలో కేజ్రీవాల్‌ను బలిపశువును చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిందని శనివారం ఆమె పేర్కొన్నారు.

Also Read
ఈడీకి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని.. కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ పరిణామం జరిగిందని వివరించారు. మార్చి 16, 2021న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలిశారని.. ఛారిటబుల్ ట్రస్ట్‌కు సంబంధించిన భూమి కోసం కలిసినట్లు తెలిపారు. ఇక కొడుకు అరెస్ట్ తర్వాత జూలై 12, 2023న తన స్టేట్‌మెంట్‌ను ఎంపీ మార్చుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ రూ.100 కోట్లు చెల్లించాలని 10 మంది సమక్షంలో అడిగారని ఎంపీ చెప్పారు. అసలు ఎవరైనా అంత మంది సమక్షంలో అంత డబ్బు అడుగుతారా? అని సునీత ప్రశ్నించారు. వాంగ్మూలాన్ని మార్చిన తర్వాతే కొడుకు రాఘవకు బెయిల్ వచ్చిందని ఆమె గుర్తుచేశారు. అంటే దీనిని బట్టి ఎంపీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని అర్థమవుతుందన్నారు. ఈడీ, సీబీఐను అడ్డంపెట్టుకుని బీజేపీ సర్కార్.. ఆప్‌ను అంతం చేయాలని అనుకుంటున్నారని సునీతా ఆరోపించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!