Liquor : నిత్యం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల్లో కల్తీని చూస్తున్న ప్రజలకు, చివరకు మద్యం కూడా కల్తీ అవుతోందన్న వార్త షాక్‌కు గురిచేస్తోంది. తాజాగా, లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్‌లో అక్రమంగా మద్యాన్ని కల్తీ చేస్తూ ఉండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్ బార్ యొక్క లైసెన్స్…