Tejas Fighter Jet: పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం ఇదే తొలిసారి.
భారతదేశం రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ల కోసం ఇంజిన్‌ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్‌ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి.
భారత్‌కు చెందిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఓ చారిత్రక మైలురాయిని దాటింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్ అయింది.