IPL 2025 Auction: మరో రెండు రోజుల్లో రెండు రోజులపాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం జరగనుంది. ఈ వేలంలో ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు తమ జట్టుకు సరిపోయే ఆల్ రౌండర్లుగా సహకరించగల క్రికెటర్లను జోడించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువ డబ్బుతో స్టార్ ఆల్ రౌండర్లను టీంలోకి తీసుక రావాలి అనుకుంటున్నాయి. దింతో ఇప్పుడు భారత ఆల్ రౌండర్లతో పాటు విదేశీ ఆల్ రౌండర్లకు కూడా మంచి గిరాకీ ఉంది. మరి ఏ…
West Indies vs England 2nd ODI: లియామ్ లివింగ్‌స్టోన్ కెప్టెన్ అయిన తర్వాత తన బ్యాటింగ్ విన్యాసాలను మొదలుపెట్టాడు. లివింగ్‌స్టోన్ చెలరేగి సెంచరీ చేయడంతో, ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఈ అద్భుత విజయం తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. అయితే లక్ష్యాన్ని…
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టోన్ ఊచకోత చూపించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ 28 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 39వ ఓవర్‌లో స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అందులో వరుసగా మూడు సిక్సర్లు కూడా ఉన్నాయి.
ENG v AUS T20: లియామ్ లివింగ్‌స్టోన్ అసాధారణ ప్రదర్శనతో సోఫియా గార్డెన్స్ లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టి20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగా 1-1 తో సమమైంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేసి టీ20ల్లో ఈ వేదికపై అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్ కొత్త రికార్డును నెలకొల్పాడు.…
South Africa Beat England in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించిన ప్రొటీస్.. అదే హవాను సూపర్-8లోనూ కొనసాగిస్తోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై గెలుపొందింది. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో నెగ్గింది. సూపర్-8లో రెండు వరుస…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు సునాయాసంగా చేధించింది. ఇది ఆ జట్టుకి ఏడో విజయం. ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో…