DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాక్ కింగ్స్ పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Won The Match By 15 Runs Against Punjab Kings: ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాయ్ కింగ్స్ పరాజయం పాలైంది. డీసీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని పీబీకేఎస్ ఛేధించలేకపోయింది. 198 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమ జట్టుని గెలిపించుకోవడం కోసం లియామ్ లివింగ్‌స్టన్ (48 బంతుల్లో 94), అథర్వా (42 బంతుల్లో 55) కలిసి గట్టిగానే పోరాడారు కానీ.. ఫలితం లేకుండా పోయింది. ఆ ఇద్దరు మినహాయించి మిగతా బ్యాటర్లందరూ చేతులు ఎత్తేయడం వల్ల.. పంజాబ్ కింగ్స్‌కి ఈ ఓటమి తప్పలేదు.
Naresh: పెళ్లి చేసుకున్నవారు ఎవరు హ్యాపీగా లేరు.. మేము పెళ్లి చేసుకోలేదు
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రుస్సో (37 బంతుల్లో 82) విలయతాండవం చేయడం, పృథ్వీ షా (38 బంతుల్లో 54) అర్థశతకంతో రాణించడం, డేవిడ్ వార్నర్ (31 బంతుల్లో 46)తో పాటు ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఢిల్లీ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులకు తట్టాబుట్టా సర్దేసింది. ఆరంభంలో పంజాబ్ కింగ్స్ చాలా చెత్త ప్రదర్శన కనబర్చింది. ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌లో తొలి ఓవర్ మెయిడెన్‌గా ముగిసిందంటే, మీరే అర్థం చేసుకోండి. ఆ వెంటనే గబ్బర్ ఔట్ అవ్వడంతో.. పంజాబ్ జట్టుపై ఒత్తిడి పడింది. ఆ తర్వాత పంజాబ్ మెల్లగా దూకుడు పెంచింది. సరిగ్గా 50 పరుగుల వద్ద మరో వికెట్ పడింది.
Krithi Shetty: ‘ఉప్పెన’ తరువాత ప్లాస్టిక్ సర్జరీ.. బేబమ్మ ఏం చెప్పిందంటే..?
అప్పుడు క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్‌స్టన్.. ఢిల్లీ బౌలర్లతో చెడుగుడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. రావడం రావడంతోనే అతడు తన బ్యాట్‌కి పనిచెప్పడం మొదలుపెట్టారు. అథర్వా కూడా ఊపందుకున్నాడు కానీ, అతడు బంతులు కూడా వృధా చేస్తూ వచ్చాడు. కానీ.. లివింగ్‌స్టన్ మాత్రం సాధ్యమైనంతవరకూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. భారీ షాట్లతో ఆ మైదానాన్ని హోరెత్తించేశాడు. చివరి బంతి వరకు తన జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడ్డాడు. కానీ.. ఇతర బ్యాటర్లే చేతులెత్తేశారు. 128 పరుగుల వద్ద అథర్వా పోయాక.. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఎవ్వరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. దీంతో.. లివింగ్‌స్టన్ పడ్డ కష్టం బురదలో పోసిన పన్నీరు అయిపోయింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?