ఎమ్మెల్యేలకు తమ ప్రాంతంలోని సమస్యలు చెప్పుకుంటూ ప్రజల నుంచి వినతి పత్రాలు వస్తుంటాయి. ఆ పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతేకు ఓ యువకుడి నుంచి విచిత్రమైన లేఖ వచ్చింది. చంద్రాపూర్ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, కాని తనకు ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, ఎంత ప్రయత్నించినా తనకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేరని, జులాయిగా తిరిగే వాళ్లకు, తాగుబోతులకు కూడా గర్ల్‌ఫ్రెండ్స్…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, లేఖలు నడుస్తూనే ఉన్నాయి.. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు మరోలేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ… బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమే.. దాని నుండి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మల్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని.. హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్టు నుండి బేసిన్ ఆవలకి నీటి తరలింపు వల్ల బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. నది ఒడ్డున ఉన్న…
నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నైకి లేఖ రాసింది కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన నివేదిక సమర్పించేందుకు మరో మూడు వారాలు గడువును ఇవ్వాల్సిందిగా.. ఎన్జీటీని కోరారు బోర్డ్ మెంబెర్ సెక్రటరీ రాయపురే.. కాగా, గత వారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలతో ఇప్పటికే రెండు, మూడు సార్లు పర్యటన వాయిదా వేశారు. అయితే, ఎన్జీటీ పెట్టిన గడువు త్వరలోనే…
వివిధ సమస్యలపై కేంద్రానికి వరుసగా లేఖరాస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా మరో లేఖ రాశారు.. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కోరారు.. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని…
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు…
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తూనే ఉంది ఏపీ.. తాజాగా,, మరో లేఖ కేంద్రానికి వెళ్లింది.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామల రావు.. భారీ ప్రాజెక్టులు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను కాజేస్తోందని ఫిర్యాదు చేశారు.. 8 భారీ ప్రాజెక్టుల ద్వారా 183…
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ లకు కేంద్రం అండగా నిలవాలి అని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు అందించాల్సిన సహాయక చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు విజ్ఞప్తి చేశారు.…
తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్‌ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి…
జల వివాదం నిన్న ప్రధాని మోడీ లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఇవాళ ‘దిశ’ ఆమోదం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆరు పేజీల లేఖ రాశారు సీఎం జగన్. మహిళలు, పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీరి భద్రత కోసం దిశ చట్టం తీసుకుని వచ్చామని లేఖలో పేర్కొన్నారు. read also : జల వివాదంపై మేం…