Black Magic: ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకపోతే సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా కొందరు క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంగటనలు కూడా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. లేపాక్షి మండలంలోని మానేంపల్లి – జూమాకులపల్లి గ్రామాల మధ్య రోడ్డు పైన పూజల ఆనవాళ్లు కనపడ్డాయి.…
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ.. జయ రామ అని చప్పట్లు కొడుతూ వేద పండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. అనంతరం.. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి పాల సముద్రం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.
ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు.. పురాతన కట్టడాలను, చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కట్టడాలు కింద.. నిధులు ఉన్నాయన్న నమ్మకంతో వాటిని సర్వ నాశనం చేస్తున్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన అనంతలో చారిత్రక సంపద ధ్వంసమవుతోంది. చివరికి లేపాక్షి క్షేత్రాన్ని కూడా వదలకుండా ధ్వంసం చేస్తుంటే, అధికార యంత్రాంగం ఏం చేస్తోందని పురావస్తు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లా పేరుకి కరువు ప్రాంతమైనప్పటికీ.. గతంలో రాజులు పాలించిన ఒక చారిత్రక…
అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు. లేపాక్షి అంటే తెలుగు సంస్కృతికి భారతీయ సంస్కృతికి పవిత్రతకు మారుపేరు. రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి ఆలయాన్ని కానీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. లేపాక్షి ఆలయానికి నందికి ఆనుకుని హైవే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం మొండికేసినప్పుడు దాన్ని తానే ఆపానన్నారు. లేపాక్షి ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చేర్చాలి, అవసరమైతే దీని కోసం నేను పార్లమెంట్లో…
పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మగ్గాల యజమానులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అనంతపురంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ దాడులు తూతూమంత్రంగా జరిగాయంటున్నారు. మగ్గాల యజమానులతో కుమ్మక్కై ఎలాంటి కేసు నమోదు చేయకుండా మూడురోజులపాటు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఇలాంటి దాడులతో ఒరిగేదేం లేదంటున్నారు. మూడునాళ్ళ ముచ్చట అనే రీతిగా వ్యవహరించిన తీరు అనంతపురం జిల్లా హిందూపురం లో జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పవర్లూమ్స్ యూనిట్ల పై ఎన్…