Leopard Catch: కర్ణాటకలోని తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో ఓ చిరుతపులి వచ్చి ప్రజలపై దాడులను చేస్తుండేది. ఈ చిరుతపులిని అటవీ అధికారులతో పాటు కొందరు గ్రామస్తులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, చిరుతను పట్టుకునే సమయంలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి పారిపోతున్న చిరుతపులి తోక పట్టుకుని బోనులో బంధించాడు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. Also Read:…
Leopard attack: తమిళనాడు రాష్ట్రం వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన జరిగింది. వంట కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన 20 ఏళ్ల అంజలీ అనే యువతి చిరుతపులి దాడికి గురైంది. అంజలీ కట్టెలు తీసుకొని ఇంటి వైపు వస్తుండగా, చిరుతపులి ఆమెపై దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి హతమార్చింది. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. కట్టెల కోసం ఉదయం బయలు దేరిన అమ్మాయి సాయంత్రం వరకు…
ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చిరుతపులిని వేటాడిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వేటగాళ్ళు చిరుతపులిని చంపి, దాని చర్మం తీసి, దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసు నువాపా జిల్లా దేవ్‌ధార గ్రామ సమీపంలో ఉంది.
చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, వారి నుంచి చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు డీఎఫ్‌వో భరణి..
Two Leopards Dead in Chittoor: చిత్తూరు జిల్లాలో రెండు చిరుతపులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. సోమల మండలంలో ఓ చిరుతపులి చనిపోగా.. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో మరో చిరుతపులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. Also Read: Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! చిరుతపులుల మరణాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు చిరుత పులులను గోర్ల…
కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధ్రువీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు పాద ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు.
రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో తెల్లవారుజామున చిరుతపులి కదలిక చిత్రాలు కనిపించాయి. చిరుత పులి ప్రస్తుతం దివాన్ చెరువు అటవీప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.. చిరుతపులి కదలికలను గుర్తించు నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను ఫారెస్ట్ అధికారులు ఉపయోగిస్తున్నారు.
రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకోడానికి ఆపరేషన్ కొనసాగుతుంది. దివాస్ చెరువు అటవీప్రాంతాలలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి కదలిక చిత్రాలు గుర్తించారు. చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుతపులి పాదముద్రాలు కనుగొన్నారు. చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను కొన్ని ప్రదేశాలలో అమర్చారు..
Leopard at Mahanandi Temple: నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మహానంది క్షేత్రానికి 6 కిమీల సమీపంలోని క్రిష్ణనంది క్షేత్రం వద్ద చిరుత సంచరిస్తోంది. చిరుతను చూసి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఓ గంట తర్వాత మహానంది క్షేత్రంలోని పెద్ద నంది వద్ద చిరుత కనిపించింది. రెండు ఒకటేనా లేదా వేరువేరా అని స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయ్యాయి. Also…