Two Leopards Dead in Chittoor: చిత్తూరు జిల్లాలో రెండు చిరుతపులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. సోమల మండలంలో ఓ చిరుతపులి చనిపోగా.. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో మరో చిరుతపులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Also Read: Pinipe Viswarup: మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు అరెస్ట్!
చిరుతపులుల మరణాలపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు చిరుత పులులను గోర్ల కోసం చంపినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేటగాళ్లు చిరుతపులి పంజా గోళ్ళు కత్తిరించి తీసుకెళ్లినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు సమగ్ర దర్యాప్తు అనంతరం తెలుస్తుందని అధికారులు తెలిపారు.